Siddipet: కనీస వేతనాల పెంపుపై సంబరాలు చేద్దాం: శ్రీనివాస్ రెడ్డి
Siddipet: తెలంగాణలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది.
Siddipet: కనీస వేతనాల పెంపుపై సంబరాలు చేద్దాం: శ్రీనివాస్ రెడ్డి
సిద్దిపేట జిల్లా: దుబ్బాక, తొగుటలో తెలంగాణ రాష్ట్రంలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు శుభవార్త అందిస్తూ, కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పెరిగిన కనీస వేతనాలు జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్రంలోని కార్మికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.కార్మిక సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని స్వాగతిస్తూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆత్మ కమిటీ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచులు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని సిఎం రెవంత్ రెడ్డి చిత్రపటానికి పాలబిషేకం కార్యక్రమం నిర్వహిద్దాం.




