Doulthabad: సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసా.. లబ్ధిదారులకు అందిన చెక్కులు!
Doulthabad: మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారి ఆదేశాల మేరకు దౌల్తాబాద్ మండలంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.
Doulthabad: సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసా.. లబ్ధిదారులకు అందిన చెక్కులు!
Doulthabad: మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ బీజేపీ మండల అధ్యక్షులు లావణ్య నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మండల పరిధిలోని లింగరాజుపల్లి గ్రామానికి చెందిన పోతుల నాగరాజుకు రూ.45 వేల చెక్కు, పోతుల లక్ష్మికి రూ.19,500 చెక్కు, ముత్యంపేట గ్రామానికి చెందిన బండి అంజయ్యకు రూ.9,500 చెక్కు, హైమద్ నగర్ గ్రామానికి చెందిన షేక్ = మొయిన్కు రూ.7,500 చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ = ద్వారా ఆర్థిక సహాయం అందడం ఉపశమనంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ముత్యంపేట ఉపసర్పంచ్ కరుణాకర్, మండల ఉపాధ్యక్షుడు స్వామి, సీనియర్ నాయకుడు కనకరాజు, మాజీ బూత్ అధ్యక్షుడు గణేష్ స్వామి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




