Siddipet: ఇందిరమ్మ ఇళ్లు, జలసిరి పనులపై సిద్దిపేట కలెక్టర్ సమీక్ష!

Siddipet: సిద్దిపేట జిల్లాలో వనమహోత్సవం, జలసిరి, ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై కలెక్టర్ కె.హైమావతి జూమ్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.

RAJU, SIDDIPET
Published on: 1 Sept 2026 5:20 PM IST
Siddipet
X

Siddipet: ఇందిరమ్మ ఇళ్లు, జలసిరి పనులపై సిద్దిపేట కలెక్టర్ సమీక్ష!

సిద్దిపేట: మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్ లో వనమహోత్సవం, జలసిరి, ఇందిరమ్మ ఇళ్లు, పలు అంశాలపైన సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి జూమ్ సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వనమహోత్సవం భాగంగా ప్లాంటేషన్ 83 శాతం పూర్తయిందని జిల్లా టార్గెట్ 17లక్షల 60 వేలకు గాను 14 లక్షల 63 వేలు ప్లాంటేషన్ చేశారని 100 శాతం ప్లాంటేషన్ పూర్తి చెయ్యాలని, పెట్టిన ప్రతి మొక్కకి జియో టాగింగ్ ప్రక్రియ కూడా పూర్తి చెయ్యాలని ఎంపిడిఓ లను ఆదేశించారు.

జలసిరి లో భాగంగా వర్షానికి పడిన ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టడం కోసం ప్రభుత్వం ఈ జలసిరి కార్యక్రమం చేపట్టిందని ఆయా మండలాల్లోని ఆశించిన స్థాయిలో పనుల్లో పురోగతి లేనందున అసహనం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, అలసత్వం ప్రదర్శిస్తున్న ప్రతి ఒక్కరిపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో ఫాంపౌండ్ కోసం రైతులను గుర్తించి.

వెంటనే పనులు మొదలు పెట్టాలని, బోర్ వెల్ రీచార్జ్ స్టక్చర్ కోసం గ్రామంలో ఎన్ని ఇలాంటి బోర్లు ఉన్నాయి లెక్కించి ఆయా రైతులతో మాట్లాడి బోర్ వెల్ రీచార్జ్ స్టక్చర్ వలన బోర్లలో నీటి శాతం పెరుగుతుందని తెలపాలి. రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్టక్చర్, ఇంకుడుగుంతలు, సామూహిక ఇంకుడు గుంతలు, ముందుగా మండలంలోని ప్రభుత్వ భవనాలు అయిన గ్రామపంచాయతీ భవనాలు, స్కూల్స్, తహసిల్దార్ కార్యాలయం, ఎంపిడిఓ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ భవనాలలు, ఎంపిక చేసుకుని ఎస్టిమేట్ వేసి రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్టక్చర్ తప్పనిసరిగా ఏర్పాటు చెయ్యాలని ఏపిఓ లను ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు మొదటి విడతలో మంజూరు అయిన వాటిలో రూఫ్ లెవెల్ మరియు చిన్న చిన్న పనులు ఉన్న నిర్మాణాలను పూర్తి స్థాయిలో ఈ నెల 15 వరకు గృహ ప్రవేశాలు చేసేలా పని చెయ్యాలని, మార్కౌట్, గ్రౌండింగ్ కానీ వాటిని వెంటనే మొదలు పెట్టాలని, నిర్మాణంలో ఆలస్యం అవుతున్న వారితో స్థానిక ప్రజాప్రతిందులతో కలిసి చర్చించి నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపిడిఓ లను ఆదేశించారు. రెండవ విడతలో మంజూరు చేయబడిన లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చెయ్యాలని ఆదేశించారు.

విబిజి రామ్ జీ లో చేపడుతున్న మండలాల వారిగా గ్రామాల్లో మంజూరు అయిన అంగన్వాడి, గ్రామపంచాయతీ భవనాలు, ఎస్ఎచ్ జీ భవనాలు పనులు మొదలు పెట్టని వాటిని గ్రామాల్లో గ్రామ సర్పంచ్ పాలకవర్గం తో సమావేశాలు నిర్వహించి భవనాలను మొదలు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భవనాల నిర్మాణంలో ఉన్నవి భవనాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

చేయూత పెన్షన్లు డెత్ మార్కింగ్ వెరిఫై ప్రక్రియ పూర్తి చేసి క్లోజ్ చెయ్యాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సిఈఓ మరియు ఇంచార్జీ డిఆర్డిఓ రమేష్, డిపిఓ రవీందర్, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్, మిషన్ భగీరథ ఈఈ, హౌసింగ్ పిడి భగవంత్ రావు, తదితరులు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET

Next Story