Siddipet: ఈనెల 19న కలెక్టరేట్‌లో ప్రజావాణి రద్దు: కలెక్టర్ కే. హైమావతి

Siddipet: బతుకమ్మ, దసరా, మహర్నవమి పండుగల సందర్భంగా ఈనెల 19వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దయినట్లు కలెక్టర్ తెలిపారు.

RAJU, SIDDIPET
Published on: 17 Oct 2026 5:16 PM IST
Siddipet
X

Siddipet: ఈనెల 19న కలెక్టరేట్‌లో ప్రజావాణి రద్దు: కలెక్టర్ కే. హైమావతి

Siddipet: బతుకమ్మ, దసరా పండగలు మరియు మహర్నవమి ఐచ్చిక సెలవు సందర్భంగా కలెక్టరేట్ లో ఈనెల 19వ తేదీ సోమవారం నాడు నిర్వహించవలసిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కే. హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈనెల 19వ తేదీన సోమవారం నాడు ఐడిఓసి లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేసినందున ఈ విషయాన్ని గమనించి 19 వ తేదీ సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమం కోసం కలెక్టరేట్ కు జిల్లా ప్రజలు ఎవరు రాకూడదని తెలిపారు. అదేవిధంగా ఆ తర్వాత సోమవారం నుండి ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ప్రజలు గమనించాలని జిల్లా కలెక్టర్ కే.హైమావతి ఆ ప్రకటనలో తెలిపారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET