Toguta: మాదకద్రవ్యాలు, ఆన్లైన్ బెట్టింగ్స్‌కు యువత బానిసలు కావద్దు- సిపి

Toguta: సిద్దిపేటలో 'మన ఊరు మన పోలీస్' కార్యక్రమం. మాదకద్రవ్యాలు, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు యువత దూరంగా ఉండాలని సీపీ రష్మీ పెరుమాళ్ సూచన.

Chindam Karunakar, Dubbak
Published on: 23 Jun 2026 8:46 AM IST
Toguta
X

Toguta: మాదకద్రవ్యాలు, ఆన్లైన్ బెట్టింగ్స్‌కు యువత బానిసలు కావద్దు- సిపి

Siddipet: మాదకద్రవ్యాలకు, ఆన్లైన్ బెట్టింగ్స్‌కు యువత బానిసలు కావద్దని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ సూచించారు. తొగుట మండలం గుడికందుల గ్రామంలో "మన ఊరు మన పోలీస్" కార్యక్రమం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని వెల్లడించారు. యువత చెడు మార్గాల వైపు వెళ్లవద్దని హితవు పలికిన సీపీ, ప్రతి ఒక్కరూ జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు.

లక్ష్యం లేని జీవితం దారి తప్పుతుందని, క్రమశిక్షణతో ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా గ్రామ యువతకు, పోలీసులకు మధ్య వాలీబాల్ టోర్నమెంట్‌ను సీపీ రష్మీ పెరుమాళ్ ప్రారంభించారు. క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, స్నేహ భావం పెంపొందుతుందన్నారు.

గుడికందుల గ్రామస్తులు ఘన స్వాగతం పలకడంపై సీపీ అభినందనలు తెలిపారు. పోలీసులు, ప్రజల మధ్య సఖ్యత పెరగాలన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story