Siddipet: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో భూముల సమగ్ర సర్వే!

Siddipet: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో సర్వే నంబర్ 325 ప్రభుత్వ భూములపై అధికారుల సమగ్ర సర్వే.. రోవర్ టెక్నాలజీ వినియోగం.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Published on: 18 Sept 2026 1:42 PM IST
Siddipet
X

Siddipet: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో భూముల సమగ్ర సర్వే!

Siddipet: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 325 భూములపై సర్వే డిపార్ట్‌మెంట్ అధికారులు సమగ్ర సర్వే చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో నాలుగు ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో భూముల హద్దులను పరిశీలిస్తున్నాయి. ఎర్రవల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 325 పరిధిలో 388 ఎకరాల 5 గుంటల ప్రభుత్వ భూమి ఉన్నట్లు సర్వే అధికారులు తెలిపారు.

ఈ భూములు ఎర్రవల్లితో పాటు వెంకటాపురం, వరదరాజపురం గ్రామ శివారులను ఆనుకుని ఉన్నాయి. భూముల హద్దులను ఖచ్చితంగా గుర్తించేందుకు అధికారులు శాటిలైట్ ఆధారిత రోవర్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. రోవర్ ద్వారా ఖచ్చితమైన పాయింట్లను సేకరించి, వాటి ఆధారంగా భూముల మ్యాప్‌ను రూపొందిస్తున్నారు.

అలాగే సర్వేలో భాగంగా చెరువులు, కాలువలు, సాగుకు అనుకూలమైన భూములు, సాగుకు అనుకూలం కాని భూముల వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. పట్టా నంబర్లు, టీపన్లు అందుబాటులో లేని పరిస్థితుల్లో పొరుగు భూముల సరిహద్దులను ఆధారంగా చేసుకుని సర్వే నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ సేవ్య నాయక్ తెలిపారు.

సర్వేకు స్థానిక రైతులు పూర్తి సహకారం అందిస్తున్నారని అధికారులు వెల్లడించారు. సర్వే పూర్తయిన తర్వాత సర్వే నంబర్ 325లోని భూముల హద్దులు, విస్తీర్ణం, భూముల స్వరూపంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL