Siddipet: రైతులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ రాజకీయాలు.. ఇమామ్
Siddipet: సిద్ధిపేట మార్కెట్ యార్డును సందర్శించిన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్, బీఆర్ఎస్ నాయకులపై నిప్పులు చెరిగారు.
Siddipet: రైతులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ రాజకీయాలు.. ఇమామ్
Siddipet: 10 సంవత్సరాలు అధికారంలో ఉండి రైతులను విస్మరించిన బీఆర్ఎస్ అధికారం పోయిన తరువాత రైతుల పట్ల బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నరు అని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు అన్నారు. సిద్ధిపేట లోని మార్కెట్ యార్డులో వరి ధాన్యం కోసం గన్నీ బ్యాగులు కొరత ఉన్నాయని తెలియడంతో సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు సందర్శించారు.
ఈ సందర్భంగా వరి ధాన్యం కోసం గన్నీ సంచులు కొరత ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు మాట్లాడుతూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బిఆరెస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని అన్నారు.
Next Story




