Siddipet: కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఫైర్!

Siddipet: బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోకుండా ఇప్పుడు హరీశ్ రావు మొసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు అత్తు ఇమామ్ విమర్శించారు.

RAJU, SIDDIPET
Published on: 21 July 2026 7:35 PM IST
Siddipet
X

Siddipet: కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఫైర్!

సిద్ధిపేట: బిఆరెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోలేదు కానీ ఇప్పుడు రైతుల పట్ల ఎమ్మెల్యే హరీశ్ రావు బిఆరెస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నరు అని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు.

ఈ సందర్భంగా అత్తు ఇమామ్ మాట్లాడుతూ, 20 వేల కోట్ల రూపాయలతో పూర్తి అయ్యే ప్రాజెక్టును లక్ష కోట్ల రూపాయల అంచనాకు పెంచి కెసిఆర్ కుటుంబం కేటీఆర్ హరీశ్ రావు కవిత ప్రజల సొమ్మును దోచుకున్నారు అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది అని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది అని మరో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలి అని అన్నారు. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే బిఆరెస్ పార్టీ నాయకుల తాట తీస్తాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కలిముద్దీన్, మార్కా సతీష్, దాస అంజయ్య, వహాబ్, గయాసుద్దీన్ ,బంక చిరంజీవి, విజయ డైనల్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET

Next Story