Dubbaka: మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా కడుదూరి నరేందర్ రెడ్డి ఎన్నిక!
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా రఘోత్తంపల్లి గ్రామానికి చెందిన కడుదూరి నరేందర్ రెడ్డి ఎంపికయ్యారు.
Dubbaka: మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా కడుదూరి నరేందర్ రెడ్డి ఎన్నిక!
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మండల పరిధిలోని రఘోత్తంపల్లి గ్రామానికి చెందిన కడుదూరి నరేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉత్తర్వుల మేరకు ఆయనను ఈ పదవికి ఎంపిక చేసినట్లు పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులు తెలిపారు. నరేందర్ రెడ్డి నియామకంపై మండల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
గ్రామీణ స్థాయిలో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యలపై పోరాటాలకు ఆయన నిరంతరం అందుబాటులో ఉంటానని పలువురు నాయకులు పేర్కొన్నారు. తనపై నమ్మకంతో మండల పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించిన అధిష్టానానికి,ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రికి,కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి,
జిల్లా అధ్యక్షురాలు తూముకుంట ఆంక్షరెడ్డికి నియోజకవర్గ నాయకులకు నరేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ మండలంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.




