Dubbak: దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ గుండెపోటుతో మృతి
Dubbak: సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్ మన్నె రఘునందన్ (46) గురువారం విధుల్లో ఉండగా గుండెపోటుతో మృతి చెందారు.
Dubbak: దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ గుండెపోటుతో మృతి
సిద్దిపేట జిల్లా: దుబ్బాక ప్రభుత్వం జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్ గా పనిచేస్తున్న మన్నె రఘునందన్ (46) గురువారం మృతి చెందారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వొకేషనల్ కోర్సు సీజీటీ గ్రూపులో 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు.
కళాశాలకు యధావిధి గానే హాజరైన రఘు నందన్ 12 గంటల ప్రాంతంలో తను కూర్చున్న చోటనే కింద పడిపోవడంతో సహచర ఉపన్యాసకులు వెంటనే పైకి లేపి, సీపీఆర్ చేస్తూ దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు మరోసారి సీపీఆర్ చేసి, చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
రఘు నందన్ ఆకస్మిక మృతి పట్ల కళాశాల ప్రిన్సిపాల్ చంద్రయ్య, కళాశాల లెక్చరర్లు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కళాశాలలో రెండు నిమిషాలు మౌనం పాటించి, ఆకస్మిక సెలవు ప్రకటించారు.
రఘు నందన్ మృతి పట్ల పలువురు లెక్చరర్లు ఉపాధ్యాయులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రఘు నందన్ మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన సంగారెడ్డి మండలం తాళ్లపల్లికి తరలించారు.




