Siddipet: : సీసీ కెమెరాల సాయంతో రెండే రోజుల్లో దొంగల ఆటకట్టించిన ఖాకీలు
Siddipet: సిద్దిపేట జిల్లా దుబ్బాక, చిన్నకోడూరు పరిధిలో జరిగిన వరుస దొంగతనాల కేసులను సిద్దిపేట పోలీసులు విజయవంతంగా ఛేదించారు.
Siddipet: : సీసీ కెమెరాల సాయంతో రెండే రోజుల్లో దొంగల ఆటకట్టించిన ఖాకీలు
సిద్దిపేట జిల్లా: దుబ్బాక లో జరిగిన వరుస దొంగ తనాల కు పాల్పడిన నిందితుణ్ణి అరెస్ట్ చేసినట్లు సిద్దిపేట CP రష్మీ పెరుమాళ్ తెలిపారు.సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో CP మాట్లాడారు.
CC కెమెరాలు టెక్నాలజీ సహాయంతో దుబ్బాకలొ జరిగిన దొంగతనంలో కేసును 6 టీమ్ ల సమిష్టి కృషి తో దొంగ ను పట్టుకున్నామని తెలిపారు.దొంగతనాలకు పాల్పడిన నిందితుడు బిక్షపతి గా గుర్తించినట్లు వివరించారు నిందితుడు ఇదివరకే 63 కేసులలో వివిధ జైల్ల లో ఉన్నట్లు తెలిపారు జైలు నుండి విడుదలై వచ్చిన నిందితుడు దుబ్బాకలో దొంగతనాలకు పాలు పాల్పడినట్లు వివరించారు.
నిందితుని బెయిల్ కు నిజామాబాద్ పోలీస్ కానిస్టేబుల్ సహకరించినట్టు సమాచారం ఉందన్నారు నిందితుడు నుండి,80 తులలు బంగారం, 5 న్నర కిలోల వెండి రికవరి తో పాటు 15 తులాల నకిలీ బంగారం రికవరీ చేశామన్నారు అలాగే ఈ నెల 12 వ తేదీన చిన్నకోడూరు లో ఆటో పోయిన కేసు దొంగ ను కూడాపట్టుకున్నామన్నారు.
చిన్న కోడూరు SI, సిబ్బంది చాక చక్యంగా CC కెమెరాల సహాయంతో రెండు రోజులల్లోనే దొంగను పట్టుకొని 2 ఆటోలు బైకులు దొంగతనం చేసిన వారి నుండి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.




