Siddipet: సోదరభావంతో మిలాద్-ఉన్-నబీ జరుపుకోవాలి – సిపీ రష్మి పెరుమాళ్
Siddipet: సిద్దిపేటలో మిలాద్-ఉన్-నబీ పండుగ నేపథ్యంలో శాంతి కమిటీ సభ్యులతో సీపీ రష్మి పెరుమాళ్ సమావేశం. ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని పిలుపు.
Siddipet: సోదరభావంతో మిలాద్-ఉన్-నబీ జరుపుకోవాలి – సిపీ రష్మి పెరుమాళ్
సిద్దిపేట: మిలాద్-ఉన్-నబీ పండుగను శాంతియుత, ప్రశాంత వాతావరణంలో, సోదరభావంతో జరుపుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ పిలుపునిచ్చారు. శనివారం సిద్దిపేట ఏసిపి కార్యాలయంలో స్థానిక ముస్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు మరియు శాంతి కమిటీ సభ్యులతో ఆమె ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,
ప్రార్థనలు మరియు ర్యాలీల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ర్యాలీలు నిర్వహించే సమయాల్లో స్థానిక నిర్వాహకులు, శాంతి కమిటీ సభ్యులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
సోషల్ మీడియాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసిపి రవీందర్ రెడ్డి, సిద్దిపేట వన్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి , సిద్దిపేట టు టౌన్ ఇన్స్పెక్టర్ మురళీ పాల్గొన్నారు.




