Siddipet: కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలి : సీపీ రష్మీ పెరుమాళ్

Siddipet: సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ దౌల్తాబాద్, రాయపోల్ పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు.

Chindam Karunakar, Dubbak
Published on: 20 Jun 2026 11:17 AM IST
Siddipet
X

Siddipet: కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలి : సీపీ రష్మీ పెరుమాళ్

Siddipet: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని దౌల్తాబాద్, రాయపోల్ పోలీస్టేషన్లను సీపీ రష్మీ పెరుమాళ్ తనిఖీ చేశారు. దౌల్తాబాద్ స్టేషన్లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఆమె.. స్టేషన్ పరిసరాల్లో మొక్కను నాటారు. అనంతరం రిసెప్షన్, లాకప్ రూమ్, టెక్టమ్, పార్కింగ్ విభాగాలను పరిశీలించారు. ఎస్ఐ అరుణ్ కుమార్ రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిపై సమీక్షించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పెండింగ్ కేసు లను త్వరితగతిన పూర్తి చేసి, నాణ్యమైన దర్యా పుతో చార్జిషీట్లు దాఖలు చేయాలని చెప్పారు. గ్రామాల్లో శాంతిభద్రతల కోసం ముందస్తు సమాచారం సేకరించాలని చెప్పారు. అనంతరం రాయపోల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఆమె, స్టేషన్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు.

మండలంలోని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏసీపీ నర్సింలు, సీఐ లతీఫ్, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story