Siddipet: హుస్నాబాద్‌లో నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ షురూ..

Siddipet: హుస్నాబాద్ లో నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను సిపీ రష్మీ పెరుమాళ్ ఐపీఎస్ ప్రారంభించి, జిల్లాలోని ప్రతి గ్రామాన్ని సిసిటివి నిఘాలోకి తెస్తామన్నారు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 30 July 2026 8:02 PM IST
Siddipet
X

Siddipet: హుస్నాబాద్‌లో నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ షురూ..

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను సిపి రష్మీ పెరుమాళ్ ప్రారంభించారు. అనంతరం సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. హుస్నాబాద్ పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేశామని సిపి తెలిపారు.

పోలీస్ స్టేషన్ కు అవసరమైన పూర్తి సామాగ్రిని త్వరలో సమకూరుస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామాన్ని సీసీ టీవీ కెమెరాల నిఘాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నమన్నారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD

Next Story