Daultabad: అన్ లోడింగ్ కోసం క్యూ కట్టిన వాహనలు

Daultabad: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌లోని తిరుమల కాటన్ మిల్లు వద్ద అన్నదాతల కన్నీటి రోదన.

Chindam Karunakar, Dubbak
Published on: 29 May 2026 4:41 PM IST
Daultabad
X

Daultabad: అన్ లోడింగ్ కోసం క్యూ కట్టిన వాహనలు

దౌల్తాబాద్: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలొ ఉన్న తిరుమల కాటన్ మిల్ లో వద్ద రైతుల ఆవేదన.త్రాగడానికి నీళ్ళు లేవు అంటూ ఆవేదన.ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం. వరి ధాన్యం వెంటనే బస్తాలు దించడం లేదని కాంటా పెట్టడం లేదని నాలుగు రోజు నుండి పడిగాపులు కాస్తున్న తిండి తిప్పలు లేకుండా ఉన్నప్పటికీ పట్టించుకోని అధికారులని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. ప్రభుత్వ యంత్రాంగం దగ్గరుండి ఇక్కడ మానిటరింగ్ చేసే విధానంలో లోపం.

స్థానిక కాటన్ మిల్ వద్ద ఉన్న రైస్ మిల్ యజమానులు నిర్లక్ష్య వైఖరితో ఇష్టానుసారంగా తూకం విషయంలో క్వింటాలుకు 43 44 కిలోల తూకం వేస్తున్నారు ఇదేమిటని రైతులు ప్రశ్నిస్తే వారిమీదికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆరోపణ. నాలుగు రోజుల నుండి పడిగాపులు కాస్తున్న జిల్లా యంత్రాంగం పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి వడ్ల సంచులను దించుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story