Thoguta: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

Thoguta: సిద్దిపేట జిల్లా తొగుట మండలం లింగాపూర్ గ్రామంలో అప్పుల బాధ తాళలేక తొంట నర్సింలు అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Chindam Karunakar, Dubbak
Published on: 7 Jun 2026 8:14 AM IST
Thoguta
X

Thoguta: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

తొగుట: సిద్దిపేట జిల్లా తొగుట మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన తొంట లక్ష్మి -నర్సింలు దంపతులకు ఇద్దరు కూతుర్లకు కొడుకు సంతానం కలదు. ఇటీవలే నర్సింలు తనపెద్ద కూతురు పెళ్లి చేసి మరియు గ్రామంలో కొత్తగా ఇంటి నిర్మించినాడు.

కూతురు పెళ్లికి మరియు ఇంటి నిర్మాణానికి కొన్ని అప్పులు చేసినాడు అట్టి అప్పులు ఎలా తీర్చాలని తన భార్య తొంట లక్ష్మితో చెప్తూ తరచూ బాధపడుతూ ఉండేవాడు.

తాను పని చేస్తున్న గాల్వ యదవ రెడ్డి వ్యవసాయ పొలం దగ్గరికి పని ఉంది అని చెప్పి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని గురించి వెతకగా తాను పని చేస్తున్న వ్యవసాయ పొలం వద్ద ఏదో గుర్తుతెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినాడు.

వెంటనే 108 అంబులెన్స్ ద్వారా సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డ్యూటీ డాక్టర్ పరిశీలించి మరణించినాడు తెలిపినారు. అని తన భార్య తొంట లక్ష్మి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేశారు తొగుట పోలీసులు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story