Siddipet: పంట అవశేషాలను కాల్చొద్దు.. కలెక్టర్ కె. హైమావతి కీలక హెచ్చరిక!

Siddipet: పంట అవశేషాలను కాల్చవద్దని జిల్లా కలెక్టర్ కె. హైమావతి రైతులకు విజ్ఞప్తి.

Chindam Karunakar, Dubbak
Published on: 6 Jun 2026 10:46 AM IST
Siddipet
X

Siddipet: పంట అవశేషాలను కాల్చొద్దు.. కలెక్టర్ కె. హైమావతి కీలక హెచ్చరిక!

సిద్దిపేట: జిల్లాలో పంట పొలాల్లో పంట అవశేషాలు కాల్చకూడదని, దాని వాళ్ళ అనేక నష్టాలు వస్తాయని జిల్లా కలెక్టర్ కె. హైమావతి జిల్లాలోని రైతాంగానికి విజ్ఞప్తి చేశారు.

జిల్లాలో 3 లక్షల 65 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం, 50 వేల మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేశామని, ఈ పంటలు కోసిన తర్వాత పంట అవశేషాలను (వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, పత్తి కట్టెలు మొదలైనవి) కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ పదార్థాలు మరియు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశిస్తాయి.

గాలి కాలుష్యం పెరిగి ఆరోగ్య సమస్యలు వస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ వంటి హానికర వాయువులు విడుదల అవుతాయి. నేల సారవంతత తగ్గుతుంది. అక్కడక్కడ రైతులు ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారని దీనికి ప్రత్యామ్నాయా మార్గాలు వెతకాలని అవశేషాలను కంపోస్ట్‌గా మార్చాలని, నేలలో కలిపి సేంద్రియ ఎరువుగా ఉపయోగించడం. పశువుల మేతగా వినియోగించడం. అవశేషాలతో సహా దుక్కి దున్నడం చెయ్యాలని తెలిపారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story