Dubbaka: దుబ్బాక బస్సు డిపో అధ్యక్షుడిగా దొడ్ల శ్రీనివాస్
Dubbaka: దుబ్బాక బస్సు డిపో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన దొడ్ల శ్రీనివాస్‌ను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శాలువాతో ఘనంగా సన్మానించారు.
Dubbaka: దుబ్బాక బస్సు డిపో అధ్యక్షుడిగా దొడ్ల శ్రీనివాస్
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్సు డిపో అధ్యక్షుడిగా ఎన్నికైన దొడ్ల శ్రీనివాస్ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ బక్కి వెంకటయ్యను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య గారు మాట్లాడుతూ దొడ్ల శ్రీనివాస్ గారు తన నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఆయన నాయకత్వంలో దుబ్బాక బస్సు డిపో మరింత అభివృద్ధి సాధించాలని, ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందేలా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా దొడ్ల శ్రీనివాస్ గారు తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, డిపో అభివృద్ధి కోసం మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.
ఈ సందర్భంలో చైర్మన్ వెంకటయ్య గారితో పాటు రుద్రారం సర్పంచ్ ఇదారి కనకయ్య,అరవింద్,పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు.




