Siddipet: రైతులకు మేలు జరిగేలా.. సిద్దిపేటలో ఐకెపి కొనుగోలు కేంద్రాల ప్రారంభం!
Siddipet: సిద్దిపేట జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.
Siddipet: రైతులకు మేలు జరిగేలా.. సిద్దిపేటలో ఐకెపి కొనుగోలు కేంద్రాల ప్రారంభం!
సిద్దిపేట జిల్లా: అక్బరు పేట-భూంపల్లి, మిరదొడ్డి మండలలోని పోతారెడ్డి, చెప్యాల, మల్లుపల్లి, గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ.బక్కి వెంకటయ్య ప్రారంభించారు. ఈ సందర్భంలో చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకెపి కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ధాన్యంలో తేమశాతం మించకుండా ఎండబెట్టాలని అలాగే మట్టితో లేకుండా విక్రయించాలని అన్నారు.అధికారులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, ధాన్యం కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరిగిన ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం చైర్మన్ వెంకటయ్య గారిని శాలువాతో సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు.




