Doulatabad: దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ కీలక నిర్ణయం.. కొత్త గోదాంల నిర్మాణం

Doulatabad: దౌల్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశంలో కొత్త గోదాంల నిర్మాణానికి ఏకగ్రీవ ఆమోదం. మార్కెట్ స్థలాల సర్వేకు చైర్మన్ కనకయ్య యాదవ్ ఆదేశం.

Chindam Karunakar, Dubbak
Published on: 30 Jun 2026 8:21 AM IST
Doulatabad
X

Doulatabad: దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ కీలక నిర్ణయం.. కొత్త గోదాంల నిర్మాణం

దౌల్తాబాద్: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సాధారణ సమావేశం చైర్మన్ ఐలపురం కనకయ్య యాదవ్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. మార్కెట్ కమిటీ పరిధిలో రైతులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడం, మార్కెట్ ఆస్తులను పరిరక్షించడం లక్ష్యంగా పలు కీలక తీర్మానాలను సమావేశంలో ఆమోదించారు.

ప్రస్తుతం రైతులు పండించిన ధాన్యాన్ని వర్షాలు, ఇతర ప్రకృతి పరిస్థితుల నుంచి రక్షించుకోవడానికి సరిపడా నిల్వ సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఆధునిక గోదాంల నిర్మాణానికి సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

గోదాం నిర్మాణం పూర్తయితే రైతులు తమ ధాన్యాన్ని భద్రంగా నిల్వ చేసుకునే అవకాశం లభిస్తుందని, దీనివల్ల నష్టాలు తగ్గడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యాలు కూడా మెరుగుపడతాయని సభ్యులు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, దౌల్తాబాద్, దీపాయంపల్లి, ముబారస్పూర్ గ్రామాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీకి చెందిన స్థలాలను వెంటనే సర్వే చేయించాలి.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story