Doulthabad: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవాలు

Doulthabad: సర్పంచ్ మద్దెల వనజ స్వామి ఆధ్వర్యంలో ప్రీ-స్కూల్ పిల్లలకు విద్యా సర్టిఫికెట్లు, ఉచిత యూనిఫామ్‌ల పంపిణీ.

Chindam Karunakar, Dubbak
Published on: 30 May 2026 5:55 PM IST
Doulthabad
X

Doulthabad: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవాలు

దౌల్తాబాద్: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవాలలో భాగంగా గ్రామ సర్పంచ్ మద్దెల వనజ స్వామిగారి ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం లో భాగంగా అంగన్వాడి పూర్వ ప్రాథమిక విద్యను పూర్తిచేసుకుని ఒకటవ తరగతి కి వెళ్తున్న పిల్లలకి విద్యారంభ సర్టిఫికేట్.

అంగన్వాడి ప్రీ స్కూల్ పిల్లల యూనిఫామ్స్ గ్రామ సర్పంచి గారి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ప్రీస్కూల్ పిల్లల ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ సూపర్వైజర్ గిరిజ ఉప సర్పంచ్ దుర్గని దీపిక మధుసూదన్, వార్డ్ మెంబర్ మద్దెల భాగ్యలక్ష్మి మల్లేష్, అంగన్వాడీ టీచర్స్ నాగాంజలి, రేఖ ప్రీ స్కూల్ పిల్లల పేరెంట్స్, గ్రామంలో పెద్దలు, తల్లులు, గర్భవతులు బాలింతలు తండ్రులు చిన్నారులు ఆయాలు హాజరు కావడం జరిగింది.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story