Dubbak: అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
Dubbak: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 5వ వార్డులో అంగన్వాడీ సరుకులను కౌన్సిలర్ నిరోషా వెంకటస్వామి గౌడ్ పంపిణీ చేశారు.
Dubbak: అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో కౌన్సిలర్ నిరోషా వెంకస్వామి గౌడ్ లు అంగన్వాడీ సరుకులు మంగళవారం పంపిణీ చేశారు. తీవ్ర ఎండలను దృష్టిలో ఉంచుకుని తన వార్డులోని గర్భిణీ స్త్రీలకు బాలింత తల్లులకు టెక్ హోమ్ సరుకుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 5వార్డు కౌన్సిలర్ నిరోషా వెంకటస్వామి గౌడ్ మా ట్లాడుతూ... రోజు వాతావరణంలో నెల కొన్న మార్పుల వలన రోజు వారి పనులు చేసుకునే వారు ఎండ తీవ్రంగా ఉన్నందున ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు ఎక్కువగా మంచి నీటిని తీసుకోవాలని సూచించారు అత్యవసరం అయితే కానీ బయటకు రాకపోవడం మంచిదని తెలిపారు.అంగన్వాడీ కేంద్రాల్లో సంవత్సరాల పిల్లలకు అవసరమైన బాలా అమృతం పాలు గర్భిణీ స్త్రీలకు బాలింత పోషక పదార్థాలు అందచేశారు. ఈ ఎండల వల్ల గర్భిణీ స్త్రీలు బాలింత తల్లులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు పండ్లు పాలు జ్యూస్ తాగడం మంచిది అని వారికి వివరించారు ఈ కార్యక్రమం లో పెద్ద సంఖ్యలో గర్భిణీ స్త్రీలు బాలింత తల్లులు పా ల్గొన్నారు.




