Toguta: ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశంలో పాల్గొన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి
Toguta: సిద్దిపేట జిల్లా కాన్గల్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన కాంగ్రెస్ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి.
Toguta: ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశంలో పాల్గొన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి
సిద్దిపేట జిల్లా: తొగుట మండలంలోని కాన్గల్ గ్రామంలో మహ్మద్ సమీరా బషీర్ గారి నూతన ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశంలో *దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు తదనంతరం లబ్ధిదారులకు శాలువ కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని అన్నారు కార్యక్రమంలో AMC మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్), మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి, సర్పంచ్లు ఫోరం అధ్యక్షులు పిట్ల సత్తయ్య, నాయకులు మల్లారెడ్డి, భారత్ తేజ, యెన్నం భూపాల్ రెడ్డి, సోలిపేట ప్రసాద్ రెడ్డి, భూపాల్ రెడ్డి, కొండల్ రెడ్డి బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.
Next Story




