Dubbak: తెలంగాణ ఉద్యమకారుల అరెస్టుల ఖండన.. తక్షణ విడుదలకు డిమాండ్!
Dubbak: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తెలంగాణ ఉద్యమకారుల అరెస్టులను ఖండిస్తూ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Dubbak: తెలంగాణ ఉద్యమకారుల అరెస్టుల ఖండన.. తక్షణ విడుదలకు డిమాండ్!
Dubbak: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను, కుటుంబాలను, జీవితాలను సైతం పణంగా పెట్టి పోరాడిన ఉద్యమకారులను నేడు అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం.ఎన్నికల ముందు ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించడం దురదృష్టకరం.
తమ హక్కుల కోసం ప్రశ్నిస్తున్న ఉద్యమకారులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం.ఉద్యమకారుల ప్రధాన డిమాండ్లుఅరెస్టు చేసిన ఉద్యమకారులందరినీ తక్షణమే, బేషరతుగా విడుదల చేయాలి.ఉద్యమకారులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలి.
ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి అధికారిక గుర్తింపు కార్డు అందించాలి.అర్హులైన ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలి. నెలకు ₹25,000 గౌరవ పెన్షన్ కల్పించాలి.ఉద్యమకారులకు, వారి కుటుంబాలకు కార్పొరేట్ వైద్య సదుపాయం కల్పించాలి.




