Dubbak: దుబ్బాక కోర్టు భవనంపై మంత్రి వివేక్ ఫోకస్
Dubbak: దుబ్బాకలో కోర్టు శాశ్వత భవన నిర్మాణంపై దృష్టి. పాత ప్రభుత్వ ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి.
Dubbak: దుబ్బాక కోర్టు భవనంపై మంత్రి వివేక్ ఫోకస్
సిద్దిపేట జిల్లా: దుబ్బాక పట్టణంలో కోర్టు ఏర్పాటు అంశంపై ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి పాత ప్రభుత్వ ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించారు.
నిన్నటి రోజు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీడియా మిత్రులతో ప్రకటించిన విధంగానే మంత్రిగారిని దుబ్బాకకు తీసుకువచ్చి, ప్రస్తుతం ఉన్న కోర్టుకు శాశ్వత భవనం ఏర్పాటుకు పాత ప్రభుత్వ ఆసుపత్రి స్థలం అనుకూలంగా ఉంటుందని వివరించారు. ఈ మేరకు మంత్రిగారు ఆ స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి పరిస్థితులను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి గారితో మాట్లాడుతూ, స్వర్గీయ మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి గారు దూరదృష్టితో దుబ్బాకకు కోర్టును తీసుకువచ్చారని,అయితే గత ప్రభుత్వం కోర్టు అభివృద్ధి మరియు శాశ్వత భవన నిర్మాణంపై నిర్లక్ష్యంగా వ్యవహరించాయని విమర్శించారు.




