Dubbak: ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ - 5 కిలోల గడ్డ తొలగింపు
Dubbak: దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో విజయవంతంగా అరుదైన ఆపరేషన్. మహిళ కడుపులో నుంచి 5.2 కిలోల ఫైబ్రాయిడ్ గడ్డను తొలగించిన డాక్టర్ హేమరాజ్ సింగ్, వైద్య బృందం.
Dubbak: ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ - 5 కిలోల గడ్డ తొలగింపు
దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద మరో అరుదైన ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించారు.కామారెడ్డి జిల్లా మల్కాపూర్ గ్రామానికి చెందిన రాణి (43) అనే మహిళ గత కొద్ది రోజులుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది.
డాక్టర్ హేమరాజ్ సింగ్ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా, కడుపులో ఫైబ్రాయిడ్ గడ్డ ఉన్నట్లు గుర్తించారు. బుధవారం వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి, కడుపులో నుండి సుమారు 5 కిలోల 200 గ్రాముల బరువున్న ఫైబ్రాయిడ్ గడ్డను విజయవంతంగా తొలగించారు.
అనంతరం డాక్టర్ హేమ్రాజ్ సింగ్ మాట్లాడుతూ, ప్రస్తుతం పేషెంట్ పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ఆపరేషన్ లో మత్తు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.విజయవంతంగా ఆపరేషన్ చేసిన వైద్య బృందానికి పేషెంట్ బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.




