Dubbak: దుబ్బాక రైతుల కోసం మంత్రి తుమ్మలకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వినతి

Dubbak: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు.

Chindam Karunakar, Dubbak
Published on: 15 Jun 2026 8:21 AM IST
Dubbak
X

Dubbak: దుబ్బాక రైతుల కోసం మంత్రి తుమ్మలకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వినతి

Dubbak: దుబ్బాక నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు.

నియోజకవర్గ పరిధిలో ఉన్న 5 వ్యవసాయ మార్కెట్ కమిటీల (AMC)లో ప్రతి మార్కెట్‌కు 40,000 మెట్రిక్ టన్నుల అదనపు నిల్వ సామర్థ్యం కల్పిస్తూ మొత్తం 2 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు నిల్వ సామర్థ్యం కలిగిన ఆధునిక గోదాములు మంజూరు చేయాలని కోరారు.

అలాగే రైతులకు యూరియా, దుక్కి మందు, పురుగుమందులు, వివిధ రకాల నాణ్యమైన విత్తనాలు సకాలంలో, అందుబాటు ధరల్లో లభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పంటల నిల్వ, మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడితే రైతులకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంటూ, ఈ అంశాలపై మంత్రి గారికి వినతిపత్రం అందజేశారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story