Dubbaka: కోతుల భయం.. కౌన్సిలర్ “అభయం”.. దుబ్బాకలో అదిరిపోయే ఐడియా!
Dubbaka: దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చేర్వాపూర్‌లో కోతుల బెడదకు చెక్. సొంత నిధులతో కొండముచ్చులను తెప్పించిన కౌన్సిలర్ మూర్తి సంధ్యారాణి శ్రీనివాస్ రెడ్డి.
Dubbaka: కోతుల భయం.. కౌన్సిలర్ “అభయం”.. దుబ్బాకలో అదిరిపోయే ఐడియా!
దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ఆరవ వార్డు చేర్వాపూర్ లో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, కౌన్సిలర్ మూర్తి సంధ్యారాణి శ్రీనివాస్ రెడ్డి తీసుకున్న చర్యలు ప్రజలకు ఊరటనిచ్చాయి. గత కొంతకాలంగా కోతులు జనవాసాల్లోకి చేరి తినుబండారాలు ఎత్తుకెళ్లడం, ఇళ్లపై పెంకులను ధ్వంసం చేయడం, చిన్నపిల్లలు, మహిళలను భయపెట్టడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అంతేకాకుండా వ్యవసాయ పొలాల్లోకి దూసుకెళ్లి పంటలను నాశనం చేయడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమస్యకు పరిష్కారం లేక రైతులు తమ పొలాలను బీడుగా ఉంచే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కౌన్సిలర్ సంధ్యారాణి శ్రీనివాస్ రెడ్డి స్వంత నిధులతో సుమారు రూ.50 వేల వ్యయంతో రెండు కొండముచ్చులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెప్పించారు. వాటి సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నియమించారు.




