Dubbaka: దుబ్బాకలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Dubbaka: దుబ్బాకలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు, ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ నిర్వహించిన ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి. నియోజకవర్గానికి 5,500 ఇళ్లు మంజూరు.

Chindam Karunakar, Dubbak
Published on: 8 Nov 2026 4:42 PM IST
Dubbaka
X

Dubbaka: దుబ్బాకలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

దుబ్బాక: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని,దుబ్బాకకు 5,500 ఇందిరమ్మ ఇళ్లు అందించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే అన్నారు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి. సిఎం రెవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేశారు.

అనంతరం దుబ్బాక పట్టణంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండుగ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటిముందు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతి పేదవాడి జీవితంలో సొంత ఇల్లు అనేది ఒక గొప్ప కల. ఆ కలను నిజం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.దుబ్బాక నియోజకవర్గానికి ఇప్పటివరకు 5,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం సాధారణ విషయం కాదని,పేదల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak