Dubbaka: గ్రామంలో 11 సీసీ కెమెరాలు ప్రారంభం.. పోలీస్ మూడో కన్ను పవర్ ఇదే!
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో 'సురక్ష నేత్ర' కింద 11 కొత్త సీసీ కెమెరాలను దుబ్బాక సీఐ టి. రాజేష్, సర్పంచ్ కాస హంసతో కలిసి ప్రారంభించారు.
Dubbaka: గ్రామంలో 11 సీసీ కెమెరాలు ప్రారంభం.. పోలీస్ మూడో కన్ను పవర్ ఇదే!
Dubbaka: ప్రస్తుత సమాజంలో నేరాల నియంత్రణకు, ప్రజల రక్షణకు నిఘా నేత్రాలు ఎంతో కీలకమైన సాధనాలని దుబ్బాక సర్కిల్ ఇన్స్పెక్టర్ టి. రాజేష్ తెలిపారు.సురక్ష నేత్రలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని ఆకారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 11 నిఘా నేత్రాలను గ్రామ సర్పంచ్ కాస హంస, దుబ్బాక ఎస్సై కీర్తి రాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాలు జరిగినప్పుడు దర్యాప్తును వేగవంతం చేయడానికి, సాక్ష్యాలు సేకరించడానికి, నిందితులను త్వరగా పట్టుకోవడానికి నిఘా నేత్రాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాస నాగభూషణం, పంచాయతీ కార్యదర్శి రేఖ, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Next Story




