Dubbaka: ఎంపీ రఘునందన్‌పై కాంగ్రెస్ ఫైర్: నీట్ లీకేజీపై ఎందుకు మౌనం?
Dubbaka: ఎమర్జెన్సీ గురించి మాట్లాడే బీజేపీ నేతలు, తమ 12 ఏళ్ల పాలనలోని వైఫల్యాలపై ఎందుకు మౌనంగా ఉన్నారని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ ప్రశ్నించారు.
Dubbaka: ఎంపీ రఘునందన్‌పై కాంగ్రెస్ ఫైర్: నీట్ లీకేజీపై ఎందుకు మౌనం?
మిరుదొడ్డి (సిద్దిపేట జిల్లా): ఎమర్జెన్సీ గురించి పదేపదే మాట్లాడే బీజేపీ నాయకులు మెదక్ ఎంపీ రఘునందన్ రావు తమ 12 సంవత్సరాల పాలనలో జరిగిన వైఫల్యాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏఎంసి వైస్ చైర్మన్ చెన్నై భూపాల్ గౌడ్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు కోరడం న్యాయమైన డిమాండ్ అని అన్నారు. గతంలో ప్రభుత్వాల్లో మంత్రులు నైతిక బాధ్యత వహించి రాజీనామాలు చేసిన సందర్భాలు ఉన్నాయని, కానీ బీజేపీ పాలనలో మాత్రం అలాంటి జవాబుదారీతనం కనిపించడం లేదని విమర్శించారు.




