Dubbaka: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: చెరుకు శ్రీనివాస్ రెడ్డి!

Dubbaka: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను దుబ్బాక కాంగ్రెస్ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 11 Nov 2026 4:38 PM IST
Dubbaka
X

Dubbaka: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: చెరుకు శ్రీనివాస్ రెడ్డి!

దుబ్బాక: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తొగుట మండలంలోని తొగుట, తుక్కాపూర్, ఎల్లారెడ్డిపేట, లింగాపూర్,వరదరాజుపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి, అన్నదాతల ఆర్థిక ప్రగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK