Dubbaka: దుబ్బాకలో ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు!

Dubbaka: దుబ్బాకలో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవంలో నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL
Published on: 25 Jun 2026 8:16 AM IST
Dubbaka
X

Dubbaka: దుబ్బాకలో ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు!

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ కేంద్రంలోని 14 వ వార్డు లో రాసమల్లు ప్రసన్న, గవ్వల విట్టల్ గారి నూతన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో పాల్గొన్న దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ అందిస్తున్న ₹5 లక్షల రూపాయలతో నిర్మించిన 2 ఇందిరమ్మ ఇండ్ల నూతన గృహప్రవేశ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ తునికి సురేష్ 18 వ వార్డు కౌన్సిలర్ శ్రీరామ్ సరస్వతి నరేందర్, 20 వ వార్డు కౌన్సిలర్ అయిరేని అఖిల సాయి తేజ గౌడ్ దుబ్బాక ఏఎంసీ చైర్మన్ కొంగరి రవి తొగుట ఏఎంసీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్), జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గోపి కడవెరుగు, సీనియర్ నాయకులు ఆకుల దేవేందర్, సురేష్ రెడ్డి పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story