Siddipet: దుబ్బాకలో పెళ్లి కానుక అందజేసిన కౌన్సిలర్

Siddipet: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కౌన్సిలర్ బడుగు రాజు ఎన్నికల హామీ మేరకు వధువుకు రూ.5016 పెళ్లి కానుకగా అందజేశారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 29 April 2026 8:43 AM IST
Siddipet
X

Siddipet

Siddipet: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట 10వ వార్డులో కౌన్సిలర్ బడుగు రాజు తన ఎన్నికల హామీ మేరకు పెళ్లి కానుకను అందజేశారు. కీ.శే. ఎల్లయ్య కుమార్తె మహేశ్వరి వివాహ సందర్భంగా రూ.5,016లను సహాయంగా అందించారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే 11వ వార్డు కౌన్సిలర్ నందాల శ్రీకాంత్, పెంబర్తి శ్రీశైలం, బత్తిని సతీష్, చెట్ల హరీష్, పెంబర్తి కార్తీక్, పూస రమేష్ తదితరులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ సామాజిక బాధ్యతను నిర్వహిస్తున్నట్లు కౌన్సిలర్ తెలిపారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story