Dubbaka: దుబ్బాక బడి పిల్లలకు సర్కార్ కానుక

Dubbaka: దుబ్బాక పరిధిలోని ధర్మాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్కులు, పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.

KARUNAKAR,	DUBBAK
Published on: 17 Jun 2026 7:50 AM IST
Dubbaka
X

Dubbaka: దుబ్బాక బడి పిల్లలకు సర్కార్ కానుక

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ ధర్మాజీపేట వార్డులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ధర్మాజీపేటలో మంగళవారం విద్యార్థులకు నోటుబుక్కులు మరియు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ధర్మాజీపేట కౌన్సిలర్లు శ్రీ వనం రమేష్ గారు, మెరుపుల సాయి కుమార్,

గోవిందు గారి శోభారాణి విష్ణువర్ధన్ రెడ్డి మమత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులను అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకొని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్యను లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story