Dubbaka: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల కోసం లబ్ధిదారుల ఆందోళన!

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద చీకోడ్ గ్రామానికి చెందిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఆందోళన, నిరసన.

KARUNAKAR,	DUBBAK
Published on: 23 Oct 2026 2:30 PM IST
Dubbaka
X

Dubbaka: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల కోసం లబ్ధిదారుల ఆందోళన!

దుబ్బాక: ఐదేళ్లుగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లలో నివసిస్తున్న తమకు పట్టాలు ఇవ్వకుండా, ఇతరులకు రహస్యంగా పట్టాలు పంపిణీ చేస్తున్నారంటూ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద చీకోడ్‌ గ్రామానికి చెందిన లబ్ధిదారులు శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. 2021లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసిందని, అప్పటి నుంచి తాము డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లలో నివసిస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పటివరకు తమకు ఇంటి పట్టాలు అందజేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్న కొందరికి పట్టాలు జారీ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

2021లో ఎంపికై అప్పటి నుంచి ఇళ్లలో నివసిస్తున్న లబ్ధిదారులకే మొదట ప్రాధాన్యత ఇచ్చి పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. కొందరి ప్రయోజనాల కోసం అధికారులు రహస్యంగా సర్టిఫికెట్లు జారీ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK