Dubbaka: దుబ్బాకలో ఎండ తీవ్రత: ధర్మారం చెరువు వట్టిపోగా రైతుల ఆందోళన

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎండల ప్రభావంతో ధర్మారం చెరువు ఎండిపోయింది. సాగునీరు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

KARUNAKAR,	DUBBAK
Updated on: 23 April 2026 10:20 AM IST
Dubbaka
X

Dubbaka

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో తీవ్ర ఎండల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. భానుడి భగభగలతో చెరువులు, కుంటలు అడుగంటిపోతుండగా, సాగునీటి సమస్యలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో చెరువు పూర్తిగా ఎండిపోవడంతో నేల నెర్రెలు బారిన పడింది.

చెరువు ఆయకట్టులో ఉన్న బోరుబావులు కూడా వట్టిపోవడంతో యాసంగి వరి సాగు అనిశ్చితిలో పడింది. నీటి లభ్యత లేక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమీపంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ, ధర్మారం గ్రామానికి కాల్వల నిర్మాణం జరగకపోవడం వల్ల నీటి సరఫరా అందడం లేదని రైతులు చెబుతున్నారు.

ఈ పరిస్థితిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, కాల్వల నిర్మాణాన్ని చేపట్టి సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story