Dubbaka: బాలికల స్కూల్‌లో ‘అన్న అక్క మెంటర్‌షిప్ AI’ ప్రోగ్రామ్ ప్రారంభం
Dubbaka: దుబ్బాక ప్రభుత్వ బాలికల స్కూల్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ లెర్నింగ్ శిక్షణ ప్రారంభం. డిగ్రీ విద్యార్థుల ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు మెంటరింగ్.
Dubbaka: బాలికల స్కూల్‌లో ‘అన్న అక్క మెంటర్‌షిప్ AI’ ప్రోగ్రామ్ ప్రారంభం
దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అన్న అక్క మెంటర్ షిప్ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ - డిజిటల్ లెర్నింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పట్నం భూపాల్ అధ్యక్షత వహించగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె భవాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు అధ్యక్షులు మాట్లాడుతూ 5 నుండి 10 తరగతులు విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్-డిజిటల్ లెర్నింగ్ పై మెంటర్ వ్యవహరిస్తూ పిల్లలకు బోధిస్తారని వివరించారు.
ఈ అవకాశాన్ని చేసుకోవాలని స్కూల్ పిల్లల్ని కోరారు.ముఖ్య అతిథి ప్రొఫెసర్ కే భవాని మాట్లాడుతూ నిత్యజీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర చాలా విలువైనది అని, ప్రతి ఒక్క విద్యార్థి డిజిటల్ అక్షరాస్యత నేర్చుకోవాలని, ఇప్పుడు అది అనివార్యమని, పేర్కొన్నారు. కళాశాల నుండి డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థులు మెంటర్ వ్యవహరిస్తుంటారని విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.




