Dubbaka: ఒక రూపాయి ఖర్చు లేకుండా రోగుల కోసం ఉచిత ఆటో సేవలు!

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రికి వచ్చే రోగుల కోసం శ్రీ శ్రీ శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ ఆశ్రమం అద్భుతమైన సేవలను అందించింది.

KARUNAKAR,	DUBBAK
Published on: 17 Jun 2026 9:27 AM IST
Dubbaka
X

Dubbaka: ఒక రూపాయి ఖర్చు లేకుండా రోగుల కోసం ఉచిత ఆటో సేవలు!

Dubbaka: శ్రీ శ్రీ శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజు జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణం లోని ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రికి ఆశ్రమ నిర్వాహకులు స్వామి సమర్థ ఆదేశాను సారం బ్యాటరీ ఆటోను బహుకరించారు.

ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వా హకులు రఘు మాట్లాడుతూ ఎన్నో గ్రామాల నుంచి ప్రతి రోజు దుబ్బాక ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రికి వచ్చే రో గులు,వృద్ధులు, గర్భిణీలు, ఆసుపత్రి సిబ్బంది ఎటువంటి ఇబ్బందులకు గురికావద్దన్న సంకల్పం తో శ్రీ శ్రీ సద్గురు స్వామి సమర్థ మహరాజ్ ఈ ఆటోను బహుకరించినట్టు ఆయన తెలిపారు.

ఆసుపత్రికి వచ్చే వారు ఈ ఆటోను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎండాకాలం,వర్షాకాలం ఆసుపత్రికి వచ్చే రోగులకు రోడ్డు పై ఉండటానికి షెల్టర్ లేక ఇబ్బందులకు గురి అవుతున్నారని శ్రీ సద్గురు స్వామి సమర్థ మహరాజ్ దృష్టికి తీసుకు రావడంతో వెంటనే ఆసుపత్రి వెళ్ళే రోడ్డుకు ఇరువైపుల రెండు బస్ షెల్టర్ లను ఆశ్రమం తరపున నిర్మించి ప్రారంభించడం జరిగిందన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story