Dubbaka: దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమ్రాజ్ సింగ్‌కు సన్మానం

Dubbaka: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమ్రాజ్ సింగ్, సిబ్బందిని ఘనంగా సన్మానించిన జర్నలిస్టులు.

Chindam Karunakar, Dubbak
Published on: 1 July 2026 3:37 PM IST
Dubbaka
X

Dubbaka: దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమ్రాజ్ సింగ్‌కు సన్మానం

దుబ్బాక: డాక్టర్స్ డే పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమ్రాజ్ సింగ్‌తో పాటు వైద్య సిబ్బందిని స్థానిక జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా దుబ్బాక ఎలక్ట్రానిక్ మీడియా నియోజకవర్గ అధ్యక్షుడు కరుణాకర్ మాట్లాడుతూ, రోగుల పట్ల అంకితభావంతో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు మానవత్వంతో సేవలు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రాణదాతలుగా సమాజంలో డాక్టర్లకు ఉన్నత స్థానం ఉందని, రాత్రింబవళ్లు తేడా లేకుండా రోగుల ప్రాణాలు కాపాడుతున్న వైద్యులకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు డాక్టర్ హేమ్రాజ్ సింగ్‌ను శాలువాతో సత్కరించారు. డాక్టర్ హేమ్రాజ్ సింగ్ మాట్లాడుతూ, ఈ గుర్తింపు తమ బాధ్యతను మరింత పెంచిందని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story