Dubbaka: ఎండ తీవ్రతపై ప్రభుత్వ వైద్యాధికారి కీలక సూచనలు

Dubbaka: సిద్దిపేట జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ హేమరాజ్ సింగ్ సూచించారు.

Chindam Karunakar, Dubbak
Published on: 23 May 2026 10:13 AM IST
Dubbaka: ఎండ తీవ్రతపై ప్రభుత్వ వైద్యాధికారి కీలక సూచనలు
X

దుబ్బాక: పెరుగుతున్న ఎండల దృశ్య ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ హేమరాజ్ సింగ్ అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక వంద పడకల ఆసుపత్రిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 25-30 రోజుల నుండి 40-45డిగిరీల ఎండల తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

ఈ ఎండల తీవ్రత వల్ల చాలామంది ప్రజలు వడదెబ్బతో జ్వరాలతో ఆసుపత్రిలో చేరడం జరుగుతుందన్నారు. బయటకి వెళ్లే ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటిస్తూ వడదెబ్బ నుండి రక్షించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు అవసరం అయితేనే ఇంటి నుండి బయటకు వెళ్లాలని 11 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఎండకు బయటకు వెళ్లకపోతే చాలా మంచిదన్నారు.

ఈ కాలంలో డిహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ ఇన్ బ్యాలెన్స్ కాకుండా కొబ్బరి నీళ్లు సేవించడం మంచినీళ్లు, ఓఆర్ఎస్ ను సేవించడం మంచిదన్నారు. ఈ ఎండాకాలంలో వడతిబ్బ తగిలిన జ్వరాలు వచ్చిన ఆసుపత్రిలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story