Dubbaka: దుబ్బాకలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం.. పాల్గొన్న కాంగ్రెస్ నేతలు!
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని 18వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది.
Dubbaka: దుబ్బాకలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం.. పాల్గొన్న కాంగ్రెస్ నేతలు!
దుబ్బాక (సిద్దిపేట జిల్లా): సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని 18వ వార్డులో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కరిపే నీలిమ సత్తయ్య గార్ల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ పూజ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపిన వార్డు కౌన్సిలర్ శ్రీరామ్ సరస్వతి నరేందర్ ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తమ సొంతింటి కలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారికి, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి, వార్డు కౌన్సిలర్ గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక ఏఎంసీ చైర్మన్ కొంగరి రవి, 15వ వార్డు కౌన్సిలర్ అనంతుల భాగ్యమ్మ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఆకుల భరత్, కడుదురి నరేందర్ రెడ్డి, జిల్లా కిసాన్ సేల్ నాయకులు మల్లు గారి రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




