Dubbaka: దుబ్బాకలో ఘనంగా ‘లైబ్రరీ డే’ వేడుకలు
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక శాఖ గ్రంథాలయంలో ప్రజా పాలనా ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రంథాలయ దినోత్సవాన్ని నిర్వహించారు.
Dubbaka: దుబ్బాకలో ఘనంగా ‘లైబ్రరీ డే’ వేడుకలు
Dubbaka: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శాఖ గ్రంధాలయం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో లైబ్రేరియన్ దాసరి రాజు ఆధ్వర్యంలో లైబ్రరీ డే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంనికి ముఖ్య అతిదిగా మండల విద్యాధికారి ప్రభుదాస్ గారు హాజరై గ్రంథాలయాలను ఉపయోగించుకొని ఉన్నతులుగా ఎదగాలన్నారు. గ్రంధాలయాలు నిశ్శబ్ద దేవాలయాలని ఎంత చదివితే అంత జ్ఞానం వస్తుందన్నారు. బాలికల ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పట్నం భూపాల్ మాట్లాడుతూ గ్రంథాలయాల ఉపయోగాలు వాటిని ఎలా ఉపయోగించుకోవాలి భవిష్యత్తులో ఎలా ఉన్నత స్థానాలకు చేరుకోవాలి. విజయాలు ఎలా సాధించాలనే విషయాలు వివరించారు. తాను కూడా గ్రంథాలయంలో ఉపయోగించుకొని ఈస్థాయిలో ఉన్నానని పాఠశాల విద్యార్థులకు చెప్పారు. గ్రంథ పాలకులు దాసరి రాజు మాట్లాడుతూ అందరూ గ్రంథాలయాలు ఉపయోగించుకోవాలన్నారు. గ్రంధాలయ సభ్యత్వం కూడా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సి ఆర్ పి గణేష్, కంప్యూటర్ శిక్షకులు అనూష మరియు 50 మంది విద్యార్థులు పాల్గున్నారు.




