Dubbaka: దుబ్బాకలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో రూ.26 లక్షల విలువైన 108 సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేశారు.

Chindam Karunakar, Dubbak
Published on: 20 May 2026 3:44 PM IST
Dubbaka
X

Dubbaka: దుబ్బాకలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు సుమారు 108 సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. మొత్తం రూ.26 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ.

పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story