Dubbaka: మహిళా సమాఖ్య భవనాలకు రూ.2.30 కోట్లు.. మంత్రులకు ధన్యవాదాలు!

Dubbaka: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లోని 23 గ్రామాలకు మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి రూ.2.30 కోట్ల నిధులు మంజూరయ్యాయి.

Chindam Karunakar, Dubbak
Published on: 29 Jun 2026 7:53 AM IST
Dubbaka
X

Dubbaka: మహిళా సమాఖ్య భవనాలకు రూ.2.30 కోట్లు.. మంత్రులకు ధన్యవాదాలు!

దుబ్బాక/దౌల్తాబాద్: సిద్దిపేట జిల్లా దౌల్తబాద్ రాయపోల్ మండలంలోని 23 గ్రామాలకు రూ.2.30 కోట్ల వ్యయంతో మహిళా సమాఖ్య భవనాలు మంజూరు కావడం ఎంతో సంతోషకరమైన విషయమని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ మద్దెల స్వామి అన్నారు.మహిళా సమాఖ్య భవనాల మంజూరుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామికి,దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి శ్రీ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి చేసిన ప్రత్యేక కృషి, నిరంతర చొరవ ఫలితంగానే ఈ నిధులు మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు.

మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు అందుబాటులోకి రావడం ద్వారా సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, స్వయం ఉపాధి కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా నిర్వహించుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. గ్రామీణ మహిళల సాధికారత, స్వయం సహాయక సంఘాల బలోపేతం, గ్రామీణాభివృద్ధికి ఈ భవనాలు ఎంతో దోహదపడతాయని అన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story