Dubbaka: అతి త్వరలో పెద్ద చెరువు సుందరీకరణ పనులు ప్రారంభం!
Dubbaka: దుబ్బాక పెద్ద చెరువును అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న పుర కమిషనర్ కే.రమేష్ కుమార్.
Dubbaka: అతి త్వరలో పెద్ద చెరువు సుందరీకరణ పనులు ప్రారంభం!
Dubbaka: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమృత 2.0 (అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫరేషన్) పథకం ద్వారా మంజూరైన రూ.3.60 కోట్లతో చేపట్టనున్న పెద్ద చెరువు సుందరీకరణ పనులను అతి త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు దుబ్బాక పుర కమిషనర్ కే.రమేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని పెద్ద చెరువును పురపాలక వర్గం సభ్యులు, పురపాలిక పబ్లిక్ హెల్త్ డిఈ మహేష్ తో కలిసి ఆయన పరిశీలించారు. పెద్ద చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ సందర్భంగా చేపట్టబోయే పనుల గూర్చి గుత్తేదారుతో కలిసి చర్చించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుందరీకరణ పూర్తయితే పెద్ద చెరువు చక్కని ఆహ్లాదకరమైన, పర్యాటక ప్రాంతంగా మారుతుందన్నారు. చెరువు సుందరీకరణలో భాగంగా చెరువు వద్ద కట్టల పటిష్టత, నీటి సంరక్షణ, పూర్తి స్థాయిలో కట్టపై రైలింగ్ నిర్మాణం, విద్యుత్ దీపాల ఏర్పాటు, మురుగునీరు చెరువులోకి చేరకుండా డ్రైన్స్ నిర్మించడం, వివిధ రకాల పూల, అలంకరణ, గజబో కుర్చీల ఏర్పాటుతో చక్కని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.




