Dubbaka: దుబ్బాకలో బెల్ట్ షాపులపై దాడి 10.75 లీటర్ల మద్యం స్వాధీనం!
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలిక దుంపలపల్లిలో అక్రమంగా నడుస్తున్న 2 బెల్ట్ షాపులపై పోలీసుల దాడి. 10.75 లీటర్ల మద్యం స్వాధీనం, ఇద్దరిపై కేసు.
Dubbaka: దుబ్బాకలో బెల్ట్ షాపులపై దాడి 10.75 లీటర్ల మద్యం స్వాధీనం!
Dubbaka: ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న రెండు బెల్ట్ షాపులపై దాడి చేసి, మధ్యాన్ని స్వాధీనం చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలోని దుంపలపల్లి నాలుగో వార్డులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు దుబ్బాక సీఐ రాజేష్, ఎస్ఐ కీర్తిరాజు ఎస్పై సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో దుంపలపల్లి 4వ వార్డులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న రెండు బెల్ట్ షాపులపై పోలీసులు దాడి చేశారు. బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి, మద్యం విక్రయిస్తున్న కోల రాజు ఇంట్లో 8.25 లీటర్ల మద్యం, ఉప్పునూతల రవి ఇంట్లో 2.5 లీటర్ల మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిపై కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ రాజేష్ తెలిపారు.
Next Story




