Dubbaka: దుబ్బాకలో 32 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత!

Dubbaka: దుబ్బాక మల్లయ్యపల్లి వద్ద బొలెరో వాహనంలో తరలిస్తున్న 32 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు. ఇద్దరిపై కేసు నమోదు.

KARUNAKAR,	DUBBAK
Published on: 18 Aug 2026 8:00 AM IST
Dubbaka
X

Dubbaka: దుబ్బాకలో 32 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత!

Dubbaka: ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా బొలెరో వాహనంలో తరలిస్తున్న 32 క్వింటాల రేషన్ బియ్యాన్ని సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ శివారులోని మల్లయ్యపల్లి వెళ్లే దారిలో పోలీసులు పట్టుకొని, కేసు నమోదు చేశారు. దుబ్బాక ఎస్పై కీర్తి రాజు ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీన మల్లయ్యపల్లి కి వెళ్లే రహదారిలో వాహనాల తనిఖీలు చేస్తున్నారు.

ఈ క్రమంలో పెద్ద చీకోడు గ్రామానికి చెందిన ఎండి సాదిక్ మరియు మొహమ్మద్ మురద్ అనే వ్యక్తి బొలెరో వాహనంలో 32 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తాసిల్దార్ రాజిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టుకున్న బియ్యం విలువ 60,000 వేల వరకు ఉంటుందని ఎస్ఐ తెలిపారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story