Dubbaka: దుబ్బాకలో బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఇబ్రహీంపూర్ వార్డు సభ్యులు..

Dubbaka: దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామ పంచాయతీకి చెందిన ఏడుగురు వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 11 May 2026 5:11 PM IST
Dubbaka: దుబ్బాకలో బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఇబ్రహీంపూర్ వార్డు సభ్యులు..
X

చేగుంట: దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామ పంచాయతీ ఏడుగురు వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. 1వ వార్డు సభ్యులు మఠం నాగరాజ్ .2వ వార్డ్ సభ్యులు నీల నర్సింలు.3వ వార్డ్ సభ్యులు చాకలి శ్యామల నవీన్ .4వ వార్డు సభ్యులు నీల మణెమ్మ బిక్షపతి 5వ వార్డ్ సభ్యులు కుమ్మరి రమ్య రాజు 6వ వార్డ్ సభ్యులు గుండమైన నవీన్ 8వ వార్డు సభ్యులు నెల్లూరి లక్ష్మీ కనకయ్య.

వీరందరికి కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు మరియు వార్డు సభ్యులు వారి గ్రామ సమస్యలను చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగింది ఇందుకుగాను త్వరలో సుమారుగా 30 లక్షల రూపాయల నిధులను జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆధ్వర్యంలో ఇబ్రహీంపూర్ గ్రామ అభివృద్ధి కొరకు శాంక్షన్ చేయిస్తానంటే తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ పాల్గొన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story