Dubbaka: దుబ్బాకలో విద్యా వారోత్సవాలు.. డిజిటల్ ప్యానెల్స్ ప్రారంభించిన నేతలు

Dubbaka: దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

Chindam Karunakar, Dubbak
Published on: 12 May 2026 8:11 AM IST
Dubbaka
X

Dubbaka: దుబ్బాకలో విద్యా వారోత్సవాలు.. డిజిటల్ ప్యానెల్స్ ప్రారంభించిన నేతలు

Siddipet: తెలంగాణ ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం విద్యా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి దుబ్బాక మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఆస సులోచన స్వామి, ఒకటవ వార్డు కౌన్సిలర్ కోటగిరి రమ్య రాజేష్, దుబ్బాక ఎంఈఓ జే ప్రభుదాస్ విచ్చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ చంద్రయ్య ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల విద్యార్థులకు డిజిటల్ తరగతుల నిర్వహణ కోసం మంజూరైన డిజిటల్ ప్యానెల్ లను వాయిస్ చైర్పర్సన్ సులోచన, కౌన్సిలర్ రమ్య ప్రారంభించారు.

అనంతరం కళాశాల అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించిన వాల్ పోస్టర్లు, కరపత్రాలను కౌన్సిలర్ రమ్య ఎంఈఓ ప్రభుదాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అన్ని వసతులతో కూడిన గదులు, అన్ని గ్రూపులకు అనుభవం కలిగిన లెక్చరర్లు ఉన్నారన్నారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తామన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story